అరేయ్ ఏంట్రా ఇది..వీళ్ళ వయసెంత ఇంతకీ ?
on Jul 11, 2025

డ్రామా జూనియర్స్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ ఎపిసోడ్ కి అనసూయ ఎంట్రీ మాములుగా లేదు. చిన్న చిన్న రెండు జడలు వేసుకుని రోజాతో పోటాపోటీగా చేసింది. ఇందులో అత్తా కోడళ్ళుగా అనసూయ, రోజా చేశారు. వీళ్ళిద్దరూ స్టేజి మీదకు వచ్చి "మేము వయసుకు వచ్చాము" అనే సాంగ్ కి డాన్స్ చేశారు. దాంతో అనిల్ రావిపూడి పెద్ద డైలాగ్ వేసాడు. "మేం వయసుకు వచ్చాము 50 కి వచ్చారా, 60 కి వచ్చారా " అనేసరికి ఇద్దరి మొహాలు మాడిపోయాయి.
ఇంతకు మీరిద్దరూ ఎవరండీ నాకు అర్ధం కాలేదు అన్నాడు. "అత్తాకోడళ్ళం" అన్నారు ఇద్దరూ. "మీ ఇద్దరిలో అత్తాకోడళ్లు ఎవరు" అన్నాడు సుధీర్. "నేను కోడలిని, రోజా గారు నాకు అత్తా" అంటూ చెప్పింది అనసూయ ."నేను అత్తను కాదు కోడలినని ఏ తలకమాసిన ఎదవని అడిగినా చెప్తాడు..సుధీర్ నువ్వు చెప్పు " అని అడిగింది రోజా. "ప్రతీ దానికి నన్ను అడుగుతారు అక్కడ ఫామిలీ డైరెక్టర్ అనిల్ గారిని అడగండి" అన్నాడు సుధీర్. "రేపు మా ఇంట్లో నాకు బారసాల మీరు తప్పకుండా రావాలి" అంటూ అనసూయ రోజాకి కార్డు ఇచ్చింది. "రేపు నాకు కుదరదు అనసూయ. నాకు పుట్టెంటుకులు తీస్తున్నారు" అని చెప్పింది రోజా. "ఎవరికి వయసు ఎక్కువుందో అందరూ చెప్తారు ముందు అది చూడండి" అంటూ అనసూయ ఒక పిక్ ని చూపించింది. అందులో సూరేకాంతంతో రోజా పిక్ చూసి షాకయ్యింది రోజా. "ఏంటి సూరేకాంతమ్మ గారికి అత్త క్యారెక్టర్ ఆ ఈమె" అని కౌంటర్ వేసాడు సుధీర్. "నీ ఫొటోస్ కూడా ఉన్నాయి చూస్కో" అంటూ రోజా ఒక పిక్ ని చూపించింది. అందులో మహాత్మా గాంధీ వెనకాల అనసూయ నడుస్తూ కనిపించింది. "అనసూయ గారు నాకు తెలీదండి మీరు ఫ్రీడమ్ ఫైటర్ అని" అంటూ సుధీర్ పెద్ద కౌంటర్ వేసాడు. ఇక అనిల్ రావిపూడి "అరే కిడ్స్ అంతా లేచి వాళ్లకు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలి" అంటూ రోజా, అనసూయ పరువు తీసేసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



